Logo
Date of Publish : 22 September 2026, 5:21 pm
Editor : Katta Ravindar

తారాచంద్ కుంట లీకేజీ సమస్యకు త్వరలో పరిష్కారం

 

అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్పంచ్ చిన్ననాయక్

అక్కన్నపేట, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 22:
అక్కన్నపేట మండలం పంతుల తండా గ్రామపంచాయతీ పరిధిలోని తారాచంద్ కుంట లీకేజీ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది. గత 20 ఏళ్లుగా కుంటకు లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పోతుండటంతో రైతులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో పంతుల తండా సర్పంచ్ చిన్ననాయక్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ డీఈ మధుసూదన్, ఏఈ అఖిల్‌తో కలిసి తారాచంద్ కుంటను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కుంట ప్రస్తుత పరిస్థితి, లీకేజీ కారణంగా నీరు వృథా అవుతున్న తీరు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సర్పంచ్ చిన్ననాయక్ అధికారులకు వివరించారు. సమస్యను పరిశీలించిన అధికారులు లీకేజీ నివారణకు అవసరమైన మరమ్మతుల కోసం అంచనాలు (ఎస్టిమేషన్) సిద్ధం చేసి, త్వరలోనే పనులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.దీర్ఘకాలంగా కొనసాగుతున్న తారాచంద్ కుంట లీకేజీ సమస్యకు పరిష్కారం లభించనున్న నేపథ్యంలో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )