[caption id="attachment_3801" align="alignleft" width="1600"]
నిజామాబాద్ జిల్లా, డొంకేశ్వర్ మండలం: తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జోరా పావని కుటుంబాన్ని డొంకేశ్వర్ మండల సర్పంచులు పరామర్శించారు. పావని గారి భర్త, పిల్లలను ఓదార్చి వారికి మనోధైర్యం కల్పించారు.
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ డొంకేశ్వర్ మండల సర్పంచుల తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్ట సమయంలో అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు బట్టు సంజీవరాజ్, అల్లారి గంగాధర్, మూడు ప్రకాష్ రాజారెడ్డి, తొగరి మహేష్, వేముల దశరథ్, గడ్డం చిన్నారెడ్డి, బైండ్ల శ్రీకాంత్, రాచర్ల భూమన్న, ఆరే గంగాధర్, అట్టోలి సంజీవ్, బానోత్ సుమన్, బరికుంట సుమలత తదితరులు పాల్గొన్నారు.[/caption]