Logo
Date of Publish : 26 September 2026, 6:56 am
Editor : Katta Ravindar

తుంగిని గ్రామంలో ఎంపీ నిధులతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

[caption id="attachment_6493" align="alignright" width="1600"] నిజామాబాద్ జిల్లా , నవీపేట్ మండలం :-తుంగిని గ్రామంలో ఎంపీ నిధులతో మంజూరైన ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో వడ్డీ మోహన్‌రెడ్డి, తుంగిని సర్పంచ్ కాంతారావు, బీజేపీ మండల అధ్యక్షుడు ద్యాగ సరిన్ పాల్గొని పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ‘అంత్యోదయ’ సిద్ధాంతం గ్రామీణాభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎంపీ నిధులను వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.
సర్పంచ్ మహాంతం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచులు భూమేష్, బినోల్, గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు రమణ, కోరే గంగాధర్, భూమయ్య, ఇతర నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )