కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో AO కి వినతి పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ మగ్గి పోయిందని మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్య వల్ల 1948 సెప్టెంబర్ 17 న నియంత నిజాం పాలన నుండి తెలంగాణాకి విమోచనం కలిగిందని నాటి నిజాం రజాకర్ల ఆకృత్యాల వల్ల ఎంతో మంది ధన, మాన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని నాటి గాయపు గుర్తులు నేటి సమాజానికి తెలిసేలా సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనీ, కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను ప్రజలకు తెలియకుండా చేస్తున్నాయని అన్నారు.