Logo
Date of Publish : 17 September 2026, 1:40 am
Editor : Katta Ravindar

తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించిన బీజేపీ

[caption id="attachment_6173" align="alignright" width="1600"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్, సెప్టెంబర్ 17: నవీపేట్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నవీపేట్ మెయిన్‌ చౌరస్తాలో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నవీపేట్ మండల అధ్యక్షుడు ద్యాగ సరిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు దేశ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 7 గంటలకు మండలంలోని ప్రతి గ్రామంలో ఆలయాల వద్ద “ఆశీర్వాద దీపారాధన” కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మైస రాధా, ఐటీ సెల్ జిల్లా ఇన్‌చార్జ్ పిల్లి శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజేందర్ గౌడ్, నీరడి భూషణ్, మహంతం సర్పంచ్ సుంకరి రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి రాజశేఖర్, పుట్టా శ్రీనివాస్ గౌడ్, గంగుని రాము, మోస్రా గోపాల్, గణేష్, కోరె గంగాధర్, భూమయ్య, వార్డు సభ్యులు ప్రేమ్‌సింగ్, భునాది నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )