[caption id="attachment_6488" align="alignright" width="1280"]
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలంలోని:- దర్యాపూర్ తండాలో శ్రీ బంజారా శివ గణేష్ మండలి నాయక్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. ఈ వేలంలో ఆరుగురు భక్తులు పాల్గొనగా, జాదవ్ విట్టల్ రూ.36,101కు లడ్డూను దక్కించుకున్నారు.
వేలం కార్యక్రమం అనంతరం గణేష్ శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో శోభాయాత్రను కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేఎల్వి రాజేందర్ గౌడ్, స్థానిక 16వ వార్డు సభ్యుడు మేగావత్ ప్రేమ్ సింగ్ నాయక్, యూత్ సభ్యులు, తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.[/caption]