[caption id="attachment_6459" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట మండల కేంద్రంలో :-జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో రూట్ మ్యాప్‌ను అధికారులు, గ్రామ పెద్దలు కలిసి పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా నవీపేట ఎస్సై శ్రీకాంత్, లోకం సందీప్, ఆర్మూర్ పట్టు మాజీ ఎంపీపీ రాజేందర్‌కుమార్ రెడ్డి (చిన్న), సర్పంచ్ సురిబాబు, గ్రామ పెద్దలు లోకం నర్సయ్య, సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ నవీన్‌రాజ్ తదితరులు రూట్‌ను కాలినడకన పరిశీలించారు.
శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు, రహదారుల పరిస్థితి, భక్తుల రాకపోకలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.[/caption]