Logo
Date of Publish : 03 October 2026, 6:31 am
Editor : Katta Ravindar

నవీపేట్ లో మేకల సంత ఆదాయం రూ.1.15 కోట్లు.. అభివృద్ధి శూన్యం

[caption id="attachment_6773" align="alignright" width="1920"] నిజామాబాద్ జిల్లా,నవీపేట మండల్ :- మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో మేకల సంత, కూరగాయల సంతల ద్వారా సుమారు రూ.1.15 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ గ్రామంలో అభివృద్ధి కనిపించడం లేదని బీసీ సంఘాల నాయకులు ప్రశ్నించారు. దీనికి తోడు ఇంటింటి పన్నులు, మార్కెట్‌ రుసుములు కూడా వసూలు చేస్తున్నారని తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో బీసీ సంఘాల మండల అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి వడ్డె రవి, గడ్డం శ్రీనివాస్‌, భాషాపతి, చోటుపాషా, నరేష్‌, మహేందర్‌ తదితరులు ఈ అంశాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో ఎక్కడ చూసినా కుక్కలు, కోతులు, దోమల బెడద అధికంగా ఉందని, పారిశుద్ధ్య సమస్యలు నెలకొన్నాయని వారు పేర్కొన్నారు.
సంతల ద్వారా వచ్చే రూ.1.15 కోట్ల ఆదాయంతో పాటు ఇంటింటి పన్నులు, మార్కెట్‌ రుసుములు, సంతకు సంబంధించిన ఇతర ఆదాయాలు కూడా వస్తున్నాయని, అయినప్పటికీ గ్రామాభివృద్ధి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.
అదేవిధంగా సంతకు సంబంధించిన ఆదాయంలో 1/3 లెక్కల ప్రకారం రూ.80 లక్షలు చెల్లించేలా కొందరు పాలకవర్గ సభ్యులు కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని బీసీ సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై సర్పంచ్‌ను వివరణ కోరగా నామమాత్రంగా మాట్లాడి దాటవేయడం బాధాకరమన్నారు.
సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరుతూ..
సంతల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం ఎంత, ఇంటింటి పన్నుల ద్వారా ఎంత వసూలు చేశారు, మార్కెట్‌ రుసుముల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, గ్రామంలోని వీధి స్తంభాలు ఎన్ని ఉన్నాయి, వాటికి ఎన్నిసార్లు లైట్లు ఏర్పాటు చేశారు, నీటి ట్యాంకులు ఎన్ని ఉన్నాయి, వాటిని ఎన్నిసార్లు శుభ్రం చేశారు తదితర వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినట్లు బీసీ సంఘాల నాయకులు తెలిపారు.
కోరిన సమాచారాన్ని అందించకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )