[caption id="attachment_6510" align="alignright" width="1920"]
నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలంలోని:- నాళేశ్వర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నవీపేట మండల అధ్యక్షుడు ద్యాగ సరిన్ మాట్లాడుతూ, భూమి కోసం, పేదల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
అలాగే నవీపేట మండల కేంద్రంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ముసుగు వేసి ఉంచడం బాధాకరమని ఆయన అన్నారు. పోరాట యోధురాలైన ఐలమ్మ విగ్రహాన్ని ప్రజలకు కనిపించకుండా ఉంచడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఐలమ్మ విగ్రహానికి వేసిన ముసుగును తొలగించి, విగ్రహాన్ని ప్రజలకు దర్శనమిచ్చేలా చర్యలు తీసుకోవాలని ద్యాగ సరిన్‌తో పాటు నవీపేట మండల రజక సంఘం సభ్యులు కోరారు.[/caption]