[caption id="attachment_6411" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 75 శాతం ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ ఆదేశాలు జారీ చేశారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వినతిపై స్పందించిన డీఈవో, కలెక్టర్ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.[/caption]