Logo
Date of Publish : 12 September 2026, 7:02 pm
Editor : Katta Ravindar

నిరసనలు, ఆందోళనల సమయంలో సంయమనం పాటిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలి ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమ్స్‌కు దూరంగా ఉండాలి ప్రజలతో మర్యాదగా, చట్టబద్ధంగా వ్యవహరించాలి సిబ్బంది అభిప్రాయాలను తెలుసుకున్న జిల్లా ఎస్పీ

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : నిరసనలు మరియు ఆందోళనల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు వ్యవహరించాల్సిన విధి విధానాలపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, సిబ్బందికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

పోలీస్ శాఖలో హోంగార్డు స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు బందోబస్తు విధుల నిర్వహణ అత్యంత కీలకమైనదని, ముఖ్యంగా నిరసనలు మరియు ఆందోళనల సమయంలో ప్రతి పోలీసు సిబ్బంది తమ విధుల పట్ల పూర్తి అవగాహనతో, సంయమనంతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేసే హక్కును గౌరవిస్తూ, అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిస్థితులను సమర్థవంతంగా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నిరసనలు, ఉద్యమాల సమయంలో పోలీసులు పాటించాల్సిన చేయాల్సినవి – చేయకూడనివి (Do’s & Don’ts) అంశాలను సిబ్బందికి సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మడం లేదా ప్రచారం చేయకుండా, విధి నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంలో వృత్తి నైపుణ్యంతో వ్యవహరించాలని తెలిపారు.

అనంతరం సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడిన జిల్లా ఎస్పీ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిబ్బంది వ్యక్తం చేసిన అంశాలను ప్రస్తుత పరిస్థితుల్లో విశ్లేషిస్తూ, వాటి వల్ల పోలీస్ శాఖపై పడే అనుకూల, ప్రతికూల ప్రభావాలను వివరించారు.

ఈ సందర్భంగా సిబ్బంది వ్యక్తిగత జీవితంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఎస్పీ వివరించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలని సూచించారు. వాటికి అలవాటు పడటం వల్ల ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలై, చివరకు ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మన పిల్లల భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్స్ జోలికి వెళ్లవద్దని జిల్లా ఎస్పీ సిబ్బందికి పిలుపునిచ్చారు. క్షణికమైన ఆశలు, ఆకర్షణలకు లోనై జీవితాన్ని, కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని దిశానిర్దేశం చేశారు.

అదేవిధంగా, తమ స్నేహితుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు లేదా గేమ్స్‌కు బానిసవుతున్నట్లు గుర్తిస్తే “నాకెందుకులే” అని పక్కకు తప్పుకోకుండా, అతడిని ఆ ఊబి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. స్నేహితుడు మంచి మార్గంలో ఉండేలా చూడటం, అవసరమైన సమయంలో సరైన సూచన ఇవ్వడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని తెలిపారు.

ప్రతి పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదగా, సంయమనంతో వ్యవహరిస్తూ, చట్టబద్ధమైన విధానాలను పాటిస్తూ బందోబస్తు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, సూచించారు.

ఇట్టి కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రిజర్వు ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్ ఆర్ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )