కామారెడ్డి జిల్లా : k24 న్యూస్ తెలుగు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాల వినియోగాన్ని ప్రజలు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహాలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. అలాగే కాలుష్య నియంత్రణ posters ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మట్టి గణపతి విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు.
వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. మట్టి గణపతి విగ్రహాల వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్ వై గిరి, బి సి సంక్దేమ అధికారి నర్సయ్య, సహాయ సంక్షేమ అధికారి చక్రధర్, మరియు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.