Logo
Date of Publish : 28 June 2026, 10:04 am
Editor : Katta Ravindar

పీవీ విగ్రహానికి తెలంగాణ రక్షణ సేన నివాళి.. కాంగ్రెస్‌పై విమర్శలు

కరీంనగర్ k24 న్యూస్ తెలుగు  ఉజ్వల పార్క్‌లో ఉన్న మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు విగ్రహానికి తెలంగాణ రక్షణ సేన నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.
పీవీ దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసి భారత అభివృద్ధికి విశేష కృషి చేశారని, ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు విగ్రహానికి నివాళులర్పించకపోవడం బాధాకరమని అన్నారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన నాయకులు విగ్రహాన్ని శుభ్రపరిచి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నూతి చరణ్, ఉమార్, సుత్రాల రాజన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )