[caption id="attachment_5926" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట మండలం :- యంచలో గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.2.15 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో పుష్కర ఘాట్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.
భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘాట్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఘాట్ నిర్మాణంతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.[/caption]