Logo
Date of Publish : 02 August 2026, 12:53 pm
Editor : Katta Ravindar

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాదు :k24 న్యూస్ తెలుగు

(ప్రస్తుతం నిజామాబాద్) – ఆర్సపల్లి,ఐ టీ ఐ 1993–1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో స్నేహితుల దినోత్సవం రోజున కలుసుకున్నారు.
చాలా సంవత్సరాల తరువాత ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఈ ఆత్మీయ సమ్మేళనానికి మా గురువు అశోక్ కుమార్ సర్ సాన్నిధ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ఆశీస్సులు, మార్గదర్శక మాటలు ఈ కార్యక్రమానికి మరింత విలువను చేకూర్చాయని ఆనందాన్ని వ్యక్తం చేసారు.

31 సంవత్సరాలకు స్నేహితుల దినోత్సవం రోజైన ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని స్నేహితులందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఆత్మీయ కలయిక అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
ఈ ఆత్మీయ కలయిక జె. ఆంజనేయులు ఈరోజు అందరం ఒకే వేదికపై కలవడానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో అంజనేయులు, రాజు, నరోత్తమ్, నందకిషోర్ పవార్, హరిప్రసాద్ అక్కల్దేవి, సంతోష్ కుమార్, డొండి మధు, శామ్యూల్ పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )