Logo
Date of Publish : 01 October 2026, 11:51 am
Editor : Katta Ravindar

పేరుకలగడ్డ ప్రాథమిక పాఠశాలలో పోషకాహార అల్పాహార పథకం ప్రారంభం

విద్యార్థుల ఆరోగ్యం, అభ్యసన సామర్థ్యాల పెంపునకు దోహదం: సర్పంచ్ శ్రీజ జీవన్ రెడ్డి

వింజపల్లి, అక్టోబర్ 1 (కే24 న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోషకాహార అల్పాహార పథకం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని గ్రామ సర్పంచ్ శ్రీజ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వింజపల్లి గ్రామంలోని పేరుకలగడ్డ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీజ జీవన్ రెడ్డి, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పాఠశాలకు హాజరై విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వింజపల్లి గ్రామంలోని పేరుకలగడ్డ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీజ జీవన్ రెడ్డి, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పాఠశాలకు హాజరై విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రవివర్మ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడం ద్వారా పాఠశాలకు హాజరు శాతం పెరగడంతో పాటు, వారి ఆరోగ్యం మెరుగుపడి అభ్యసన సామర్థ్యాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, అర్చన, దివ్య, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )