Logo
Date of Publish : 25 September 2026, 5:18 pm
Editor : Katta Ravindar

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం తృణధాన్యాలతో రక్తహీనతకు చెక్‌.. గర్భిణీకి సీమంతం

కోహెడ: తెలుగు కే న్యూస్ వింజపల్లి గ్రామంలో పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా గర్భిణీలు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని ఐసీడీఎస్ శనిగరం సెక్టార్ సూపర్‌వైజర్ సాయి భవాని అన్నారు. శుక్రవారం కోహెడ మండలం వింజపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్‌వైజర్ సాయి భవాని మాట్లాడుతూ కిషోర బాలికలు ఎదిగే వయస్సులో శరీరంలో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా రాగి, సజ్జలు, జొన్నలు, గోధుమలు, సోయాబీన్‌, చిక్కుడుకాయలు, కాయగూరలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. తృణధాన్యాలు, ఆకుకూరలు వంటి పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చని తెలిపారు.గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదల కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులకు బాలామృతం అందిస్తూ వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలకు ‘1000 గోల్డెన్ డేస్‌’ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.గర్భిణీకి సీమంతంపోషకాహార మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఓ గర్భిణీ మహిళకు గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ జీవన్‌రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు కలిసి పూలు, పండ్లు, చీర, గాజులు అందించి సంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )