Logo
Date of Publish : 30 September 2026, 1:16 pm
Editor : Katta Ravindar

ప్రజా పాలన ప్రభుత్వం అంటే ఇదేనా?

ముఖ్యమంత్రి సభ పేరుతో 50 బస్సులు తరలింపు.. ప్రయాణికులకు ఇబ్బందులు


హుస్నాబాద్: తెలుగు కే న్యూస్ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హుస్నాబాద్ డిపోకు చెందిన సుమారు 50 బస్సులను సభకు తరలించడంతో స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో హుస్నాబాద్ బస్టాండ్ నిర్మానుష్యంగా మారిందని వారు పేర్కొంటున్నారు.
ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన సమయంలో ముఖ్యమంత్రి సభ కోసం పెద్ద సంఖ్యలో బస్సులను వినియోగించడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి హుస్నాబాద్‌కు వచ్చే ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోనే ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజా పాలనలో ప్రజల ఇబ్బందులకు ప్రాధాన్యత ఇవ్వాలని, బస్సుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ ప్రజా రవాణా విషయంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని కొందరు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని, సమస్యకు పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు

 

https://youtu.be/HcW820X4eb8?si=zqo-UJNNvVGSkph


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )