[caption id="attachment_5819" align="alignright" width="1080"]
నిజామాబాద్, సెప్టెంబర్ 7: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యం కల్పించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు నేరుగా బోరు నీటిని తాగాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. కలుషిత నీటి కారణంగా విద్యార్థులు తరచూ కడుపునొప్పి, జ్వరం వంటి వ్యాధులతో బాధపడుతూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీని ప్రభావం విద్యార్థుల హాజరు శాతంతో పాటు వారి విద్యాభ్యాసంపైనా పడుతోందన్నారు. “ఒక్కపూట ఆహారం లేకున్నా ఉండగలం కానీ మంచి నీరు లేకుండా ఉండలేం” అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే ఫిల్టర్ వాటర్ సదుపాయం కల్పించి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.
వినతిపత్రంపై స్పందించిన జిల్లా కలెక్టర్ పాఠశాలల్లో ఫిల్టర్ నీటి సౌకర్యం కల్పించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా కార్యదర్శి వినయ్, సాయి నైతిక్ తదితరులు పాల్గొన్నారు.[/caption]