[caption id="attachment_6603" align="alignright" width="1080"]
శంషాబాద్: ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద.. నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ్ మృతి చెందడంతో నర్మద తీవ్రంగా కుంగిపోయింది. సిద్ధార్థ్ కలలోకి వచ్చి తనను రమ్మని పిలుస్తున్నాడని సోదరితో చెప్పేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు లేని లోకంలో తాను ఉండలేనని కుటుంబ సభ్యుల వద్ద బాధపడేదని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నర్మద ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.[/caption]