K 24 న్యూస్ తెలుగు కొండమల్లేపల్లి మండలంలోని గాజీనగర్, చిన్న ఆడిశర్లపల్లి, పెండ్లిపాకల ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం తాత్కాలిక ప్రాతిపదికన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో రమావత్ నాగేశ్వరరావు తెలిపారు. ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు జూన్ 23 నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.