[caption id="attachment_5825" align="alignright" width="1080"]
హైదరాబాద్: విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన “చలో అసెంబ్లీ” కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫీజు బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ బకాయిల విడుదలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు.
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేవైఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులకు బీజేవైఎం భయపడబోదని, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి విజయ్ కృష్ణ, ఇందూరు జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్, నవీపేట్ మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్, బోధన్ టౌన్ అధ్యక్షులు గౌతం గౌడ్, రెంజల్ మండల అధ్యక్షులు అజయ్ యాదవ్, ఎడపల్లి మండల అధ్యక్షులు సాయి, నవీపేట్ 16వ వార్డు సభ్యులు ప్రేమ్ సింగ్తో పాటు పలువురు బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.[/caption]