Logo
Date of Publish : 05 September 2026, 3:12 am
Editor : Katta Ravindar

బెస్ట్ అవార్డుకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అల్లాడి సౌజన్య ఎంపిక

కామారెడ్డి జిల్లా: k24 న్యూస్ తెలుగు : మాచారెడ్డి మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఎస్‌జీటీ (SGT) ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న అల్లాడి సౌజన్య కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారి విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసం, సమగ్ర అభివృద్ధి కోసం అంకితభావంతో చేస్తున్న కృషిని గుర్తించి ఆమెను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.

విద్యార్థుల పట్ల ఆప్యాయతతో వ్యవహరిస్తూ, బోధనలో వినూత్న పద్ధతులను అనుసరించడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు అల్లాడి సౌజన్య చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అల్లాడి సౌజన్యను తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు అభినందించారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో విద్యారంగంలో సేవలు అందిస్తూ, మరెందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆకాంక్షించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )