జగిత్యాల జిల్లా, జూలై 20(తెలుగు కే న్యూస్)::ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా నేషనల్ టీ20 ఛాంపియన్‌షిప్ – 18వ ఫెడరేషన్ కప్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన పల్లపు భరత్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.పల్లపు భరత్, పల్లపు నర్సయ్య మరియు పల్లపు లలిత దంపతుల కుమారుడు,ఆయన స్వస్థలం తిమ్మయ్యపల్లె గ్రామం, కోరుట్ల మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ ఈ టోర్నమెంట్ మొత్తం అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో "బెస్ట్ బ్యాట్స్‌మన్ అవార్డు"ను అందుకుని తన గ్రామానికి, జిల్లాకు మరియు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.పల్లపు భరత్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని మనస్పూర్తిగా అభినందనలు మరియు శుభాకాంక్షలు.