Logo
Date of Publish : 26 July 2026, 3:54 pm
Editor : Katta Ravindar

భారత సైనికుల త్యాగమే దేశానికి రక్ష విజయ్ దివస్ సందర్భంగా సైనికులకు సన్మానం

కామారెడ్డి జిల్లా:k24 న్యూస్ తెలుగు

లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల వీరోచిత పోరాటం వల్లనే దేశానికి విజయం సాధించడం జరిగిందని ఈ దేశంలోని ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం నిరంతరాయంగా పాటుపడుతున్న భారత సైనికుల సేవలు ఎంతో విలువైనవని అన్నారు.ఈ దేశం కోసం ప్రాణం త్యాగానికి కూడా వెనకాడని వ్యక్తులే భారత సైనికులని ఆ సైనికుల త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అన్నారు.ఈ దేశం కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేస్తున్న సైనికులు బండి ప్రభాకర్,మొతాజి బాలకిషన్,రిటైర్డ్ మిలటరీ సైనికులు షేక్ గౌస్ ఉద్దీన్, ఏదుల్లా రంజిత్ రెడ్డి లను సన్మానించడం జరిగింది. దేశ యువత సైన్యంలో పనిచేయడానికి ముందుకు రావాలని,ఈ దేశం కోసం ఎందరో సైనికులు ప్రాణాలను అర్పించారని వారందరికీ నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. కార్గిల్ యుద్ధం 527 మంది వారి ప్రాణాలను దేశం కోసం అర్పించారని వారు త్యాగం మరువలేనిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్ పర్సన్ చిలువేరి మారుతి,కార్యదర్శి కిరణ్ కుమార్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ,కొంక దేవేందర్,శ్రీకాంత్ లు పాల్గొనడం జరిగింది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )