K24 న్యూస్ తెలుగు భూపాలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి (DTO) మృతి చెందడం విషాదకరం. అయితే, ఈ ప్రమాదానికి సింగరేణి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రమాదానికి కారణమైన TS22T 2687 లారీ తాడిచెర్ల నుంచి చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (KTPP)కు బొగ్గు రవాణా చేస్తోందని, అది సింగరేణికి చెందిన వాహనం కాదని తెలిపింది.
సోషల్ మీడియాలో సింగరేణిని ఈ ఘటనతో ముడిపెడుతూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ధృవీకరించిన సమాచారాన్నే నమ్మాలని సింగరేణి యాజమాన్యం కోరింది