Logo
Date of Publish : 01 September 2026, 2:56 am
Editor : Katta Ravindar

మంచిర్యాలలో సంచార, అర్ధసంచార జాతుల విముక్త దినోత్సవం

మంచిర్యాల: తెలుగు కే న్యూస్ తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన 51 సంచార, అర్ధసంచార జాతులను (DNT) గౌరవిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని జిల్లా బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో విముక్త దినోత్సవాన్ని నిర్వహించారు. బీసీ సంక్షేమ అధికారి శ్రీమతి రాజేశ్వరి అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. DNT కులాలకు సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వం గుర్తించిన 51 కులాలకు ఎమ్మార్వోల ద్వారా DNT సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన రాజేశ్వరి DNT కులాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, వారి అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా DNT కోఆర్డినేటర్ తాళ్ల వేణు గోత్రాల, భాస్కర్ బుక్కయ్య, కృష్ణ వడ్డెర, జి.తిరుపతి గోత్రాల, పి.క్రాంతి కునపులి, కడారి సాగర్ వీరభద్రియ, జె.సమ్మయ్య రాజన్నల, చి.తిరుపతి పూసల తదితర కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )