మందమర్రి, తెలుగు కెన్యూస్ ఆగస్టు 16 మందమర్రి మండల కేంద్రం మందమర్రి టౌన్లో అత్యంత కీలకమైనది పాల చెట్టు ప్రాంతవాసులు, మూడవ జోన్ ప్రాంతవాసులు, డబుల్ బెడ్ రూమ్ ప్రాంత వాసులు స్థానిక పాలవాగు ప్రాంతంలో స్మశాన వాటికలు, స్నాన గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూరు నియోజకవర్గం నుండి ఉపాధి అవకాశాలు నిర్వహిస్తున్న కార్మిక గనుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ సార్, మందరి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించి బోరింగ్ పంపు వేయించాలని స్మశానవాటిక ఏర్పాటు చేసి స్నాన గదులు నిర్మించాలని కోరారు.