K24 న్యూస్ | జూన్ 24
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలకు సంబంధించిన బకాయి చెల్లింపులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపతి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు.
మూడు నెలలు గడిచినా 40 శాతం రైతులకు డబ్బులు అందలేదని, దీంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రెండు రోజుల్లో చెల్లింపులు చేయకపోతే రైతులతో కలిసి మార్క్‌ఫెడ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.