Logo
Date of Publish : 29 July 2026, 9:49 am
Editor : Katta Ravindar

మద్దేపల్లిలో ప్రకృతి అందం.. ఆకట్టుకుంటున్న గుట్ట జలపాతం

[caption id="attachment_4659" align="alignleft" width="1080"] నిజామాబాద్ జిల్లా,నవీపేట మండలం:- మద్దేపల్లి గ్రామ శివారులో కురిసిన భారీ వర్షాలకు గుట్ట ప్రాంతంలో ఏర్పడిన సహజ జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొండపై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్న నీటి ధారలను తిలకించేందుకు గ్రామస్థులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
వర్షాల కారణంగా ప్రకృతి అందాలు మరింత సోయగం సంతరించుకోవడంతో యువత, ప్రకృతి ప్రేమికులు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఈ జలపాతం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు, వాగులు నిండుకుండలా మారడంతో రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి వర్షాలు కొనసాగితే సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )