[caption id="attachment_6208" align="alignright" width="1599"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం:- మద్దేపల్లి: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసం–2026 కార్యక్రమాల్లో భాగంగా మద్దేపల్లి గ్రామపంచాయతీలో “మన అంగన్వాడీ – మన బాధ్యత” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి పిల్లల పోషణ, సంరక్షణలో తండ్రులు మరియు పురుష సంరక్షకుల భాగస్వామ్యం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
పిల్లల జీవితంలోని తొలి రెండు సంవత్సరాలు (మొదటి 1000 రోజులు) మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమని, ఈ దశలో తండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు. అలాగే గ్రామంలోని పురుష సభ్యులకు పిల్లల ఆరోగ్యం, పోషణపై సూచనలు అందించారు.
అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సీబీ ఈవెంట్స్‌లో భాగంగా గర్భిణీలకు శ్రీమంతం, ఆరు నెలల చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పోషణ మాసం లక్ష్యాలను ప్రజలకు వివరించి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ నునావత్ మనోజ్ కుమార్, ఉప సర్పంచ్ సీహెచ్ రాజు హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.[/caption]