[caption id="attachment_5444" align="alignright" width="1168"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలంలోని మద్దేపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రంలో రాఖీ పౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు రాఖీ పండుగ విశిష్టతను అంగన్వాడీ సిబ్బంది వివరించారు. బాలికలు బాలురకు రాఖీలు కట్టి సోదర–సోదరీమణుల అనుబంధాన్ని చాటారు.
వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులను అభినందించారు.[/caption]