Logo
Date of Publish : 24 September 2026, 9:08 pm
Editor : Katta Ravindar

మన ఊరు మన చెరువును కాపాడుదాం

 

కరీంనగర్ తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 24

 

మన గణపతి పండగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము అదేవిధంగా గణపతిని తీసుకెళ్లి మన చెరువులలో వేస్తున్నాము కానీ గణపతి తయారైన విధానము పిఓపి , దీనిని చెరువులో నదులలో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి మరియు మానవాళికి తీవ్రమైన హాని కలుగుతుంది జీవవైవిద్యం దెబ్బతింటుంది చెరువులంటే కేవలం నీరు ఒక్కటే కాదు అందులో ఉండే అన్ని రకాల జంతుజాలాలకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే అక్కడినుండి భూమి లోపలికి నీరు ఇంకకుండా చెరువులోపల సిమెంట్ వేసినట్టుగా తయారవుతుంది. భూగర్భ జలాలు తగ్గుతాయి అదేవిధంగా ఆ నీరు వ్యవసాయానికి వాడినప్పుడు భూమి లోపల ఉండే వానపాములు మరియు ఇంకా సూక్ష్మజీవులు మొత్తం నశించి భూమి సారం దెబ్బతింటుంది. ఆ విష ఆహారాన్ని మనం తిరిగి తీసుకోవాల్సి వస్తుంది ఎన్ని హాస్పిటల్లో మందులు ఖర్చు చేసినప్పటికీ తిరిగి ఆరోగ్యాన్ని పొందడం అనేది అసంభవంగా మారిపోయిన ఈ రోజులలో ప్రతి చిన్న అంశాన్ని మానవాళిని మరియు అన్నీ జీవజాతిని దృష్టిలో ఉంచుకోవాలి. భవిష్యత్ తరాలు బాగుండాలంటే మనo ఈ రోజు నుంచే ప్రతి చిన్న అంశాన్ని శ్రద్ధగా పర్యావరణ అనుకూలంగా జీవించాలి


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )