Logo
Date of Publish : 30 August 2026, 2:54 pm
Editor : Katta Ravindar

మాదకద్రవ్యాలపై చైతన్య ర్యాలీ సక్సెస్ వ్యసనాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు

గన్నేరువరం, ఆగస్టు 30 (తెలుగు కే న్యూస్): మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, క్యాసినోలు, జూదం వంటి చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిస్తూ యువజన కాంగ్రెస్ గన్నేరువరం మండలశాఖ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన చైతన్య ర్యాలీ విజయవంతమైంది.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ల నడుమ ర్యాలీ నిర్వహిస్తూ “వద్దు వద్దురా.. పత్తాలాట వద్దురా.. గోవా వద్దు.. గన్నేరువరం ముద్దు” అంటూ నినాదాలు చేశారు. మాదకద్రవ్యాలు, బెట్టింగ్, జూదం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి సారించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపోలు నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్, ముస్కు ఉపేందర్ రెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, మాతంగి అనిల్, వివిధ గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీకి పోలీసుల బందోబస్తు కల్పించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )