[caption id="attachment_6059" align="alignright" width="2560"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం, ఫకీరాబాద్ గ్రామ పరిధిలోని మాన్సింగ్ తండాలో తీజ్ పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. తండాకు చెందిన యువతులు, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి తీజ్ బుట్టలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పండుగ సందర్భంగా జానపద గీతాలు ఆలపిస్తూ యువతులు నృత్యాలు చేసి సందడి చేశారు. కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొనాలని, మంచి వర్షాలు కురిసి రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని దేవతలను ప్రార్థించారు.
తీజ్ పండుగ వేడుకలతో మాన్సింగ్ తండా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.[/caption]