Logo
Date of Publish : 31 August 2026, 4:01 am
Editor : Katta Ravindar

మృతి చెందిన మిత్రుని కుటుంబానికి అండగా నిలిచిన SSC 2004–05 బ్యాచ్ స్నేహితులు


రూ.36,500 ఆర్థిక సహాయం అందజేత.. భవిష్యత్‌లోనూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

 

కోహెడ, తెలుగు కే న్యూస్ ఆగస్టు 31:స్నేహానికి ప్రతిరూపంగా నిలుస్తూ తమతో కలిసి చదువుకున్న మిత్రుడు మృతి చెందడంతో అతని కుటుంబానికి ఆర్థిక చేయూత అందించి మానవత్వాన్ని చాటుకున్నారు SSC 2004–05 బ్యాచ్‌కు చెందిన మిత్రులు.కోహెడ మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన చామంతుల సంపత్ కుమార్ పది రోజుల క్రితం మృతి చెందారు. ఆయన మృతితో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని భావించిన 2004–05 SSC బ్యాచ్ మిత్రులు అందరూ కలిసి రూ.36,500లను సేకరించి, మృతుని భార్యకు అందజేశారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. సంపత్ కుమార్ తమతో కలిసి చదువుకున్న ఆత్మీయ మిత్రుడని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, నవ్విస్తూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం తమందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.మృతునికి ముగ్గురు చిన్న వయసున్న కుమార్తెలు ఉన్నందున, వారి కుటుంబానికిభవిష్యత్‌లోనూ తమ వంతు సహకారం అందిస్తామని మిత్రులు హామీ ఇచ్చారు. స్నేహితుడి కుటుంబం ఒంటరిగా లేదని, ఎలాంటి అవసరం వచ్చినా తమకు తోచిన విధంగా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.మా మధ్య భౌతికంగా మీరు లేకపోయినా.. మీతో గడిపిన మధుర జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మా హృదయాల్లో నిలిచిపోతాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం” అంటూ మిత్రులు భావోద్వేగానికి లోనయ్యారు.మిత్రుని కుటుంబానికి కష్టకాలంలో ఆర్థిక సహాయం అందించిన SSC 2004–05 బ్యాచ్ స్నేహితుల సేవాభావాన్ని పలువురు అభినందించారు. స్నేహం అంటే కేవలం కలిసి చదువుకోవడం, కలిసి తిరగడం మాత్రమే కాదని.. ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )