Logo
Date of Publish : 30 September 2026, 8:41 pm
Editor : Katta Ravindar

మృతుల కుటుంబాలను పరామర్శించిన బండి సంజయ్

హుస్నాబాద్‌K24NEWS సెప్టెంబర్ 30 : బీజేపీ హుస్నాబాద్‌ మాజీ మండల అధ్యక్షుడు వేముల ప్రభాకర్‌రెడ్డి కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పరామర్శించారు. పోట్లపల్లిలోని ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన.. భార్య సరళ, కుమారుడు కృష్ణారెడ్డిని ఓదార్చారు. ప్రభాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అదే గ్రామానికి చెందిన గజ్జెల లక్ష్మీనారాయణ కుటుంబాన్ని కూడా బండి సంజయ్‌ పరామర్శించారు. ఆయన భార్య ప్రమీల, కుమారులు శ్రీనివాస్‌, సుధాకర్‌, వెంకటేశ్వర్లు, వైకుంఠంను ఓదార్చారు. అనంతరం హుస్నాబాద్‌ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్‌ తల్లి అనసూర్య మృతిపై ఆయనను పరామర్శించారు.
ఈ పరామర్శలో కరీంనగర్‌ మేయర్‌ కోలాగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌రావు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి పైడిపల్లి పృథ్వీరాజ్‌గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtu.be/HcW820X4eb8?si=zqo-UJNNvVGSkphN


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )