కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహము మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రోజున కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఉదయం 9 గంటల నుండి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మొదటి 100 మంది రక్తదాతలకు హెల్మెట్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. రక్త దాతలు తోటి వారి ప్రాణాలను కాపాడడానికి ముందుకు వస్తారని హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని అన్నారు మరిన్ని వివరాలకు 9492874006 నంబర్ కి సంప్రదించాలని తెలియజేశారు.