Date of Publish : 27 June 2026, 5:28 pm
Editor : Katta Ravindar
*మైనర్లు వాహనం నడపరాదు: ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి* నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, జూన్ 27, తెలుగు కే న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్ పట్టణంలోని విద్య హై స్కూల్ లో ఆర్వి ఏ లీవ్, కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ, విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ మైనర్ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ నియమాలను వారి యొక్క తల్లిదండ్రులకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, స్కూల్ డైరెక్టర్ ప్రవీణ్, సామాజిక సేవకులు తులసి పట్వారీ, టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.