Logo
Date of Publish : 26 September 2026, 8:48 am
Editor : Katta Ravindar

మైసంపల్లి ZPHSలో ‘నేను కలలు కన్న భారత్’ పోటీలు

2047 నాటికి భారత్ ఎలా ఉండాలి? విద్యార్థుల ఆలోచనలకు వేదిక

కోహెడ: తెలుగు కే న్యూస్ కోహెడ మండలం మైసంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘నేను కలలు కన్న భారత్’ పేరుతో చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘PM సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలి, దేశ భవిష్యత్తుపై విద్యార్థుల కలలు, ఆలోచనలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను, దేశ భవిష్యత్తుపై తమ ఆకాంక్షలను వ్యక్తపరిచారు.ఉపన్యాస పోటీల విజేతలుప్రథమ బహుమతి భాషంపల్లి శ్రీ చరణ్ (10వ తరగతి), ద్వితీయ బహుమతి చిల్ల అనురిద్ (10వ తరగతి), తృతీయ బహుమతి చిట్యాల వర్షిత (9వ తరగతి) సాధించారు.చిత్రలేఖనం పోటీల విజేతలు:ప్రథమ బహుమతి భాషంపల్లి రీక్షిత (6వ తరగతి), ద్వితీయ బహుమతి తాడూరి రిషి (8వ తరగతి), తృతీయ బహుమతి భాషంపల్లి తరుణ్ (8వ తరగతి) గెలుచుకున్నారు.
విజేతలకు స్థానిక సర్పంచ్ పకీడే సంపత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, PM సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ ఖమ్మం వేంకటేశం, బీజేపీ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, ఉపసర్పంచ్ ఎల్లబోయిన రాజ్ కుమార్ బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఖమ్మం వేంకటేశం మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావన, సామాజిక బాధ్యత, సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు 2047 నాటికి వికసిత్ భారత్ ఎలా ఉండాలనే అంశంపై వారి ఆలోచనలను వెలుగులోకి తీసుకురావడమే ‘నేను కలలు కన్న భారత్’ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.మైసంపల్లి పాఠశాలలో 6వ నుంచి 8వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం, 6వ నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన చిత్రాలను ప్రదర్శనకు ఉంచి, అనంతరం రాష్ట్రస్థాయి ప్రదర్శనకు పంపనున్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఎంపికయ్యే విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.1 లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేల నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు.నేటి విద్యార్థులే రేపటి భారతదేశానికి నాయకత్వం వహించబోతున్నారని, వారి కలలు, ఆలోచనలు, సృజనాత్మకత వికసిత్ భారత్ నిర్మాణంలో కీలకమని ఖమ్మం వేంకటేశం అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి బొమ్మగాని రంజిత్ గౌడ్, యువమోర్చా మండల అధ్యక్షుడు నాగు అజయ్ పటేల్, పుప్పాల కేదారి, ఇట్టబోయిన శ్రీకాంత్, ఏనుగుల ఎల్లయ్య, లింగంపల్లి వెంకటేష్, సంగెం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జి. రవికుమార్, ఎం. సత్యనారాయణ, టి. అంజయ్య, కె. రాజయ్య, ఎ. అనంతలక్ష్మి, ఎం.డి. యాకూబ్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )