[caption id="attachment_6270" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట, సెప్టెంబర్ 20: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అల్జాగర్ శివారులో చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని ఆదివారం స్థానికులు, మత్స్యకారుల సహాయంతో వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
కొన్ని రోజుల క్రితం చెరువులోకి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. గాలింపు చర్యలు కొనసాగించిన అనంతరం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.[/caption]