Logo
Date of Publish : 26 September 2026, 6:50 pm
Editor : Katta Ravindar

యూపీఐ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి

కేంద్ర ప్రభుత్వానికి ఏఐవైఎఫ్ హెచ్చరిక

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సంతకాల సేకరణ కార్యక్రమం

సిద్దిపేట :K24NEWS కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ చార్జీల విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సిద్దిపేట జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట మాడ్రన్ బస్టాండ్ లో యూపీఐ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం రూ.2,000కు మించిన వ్యక్తి–వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం వ్యాపారి రుసుము, రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 వరకు వర్తిస్తుందన్నారు. వ్యక్తి, వ్యక్తి లావాదేవీలు, రూ.2,000 వరకు వ్యాపారి లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఈ కొత్త రుసుము విధానం వల్ల భవిష్యత్తులో చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న యువతపై పడే ఆర్థిక ప్రభావంపై స్పష్టమైన హామీ, పారదర్శకత అవసరమన్నారు. ప్రభుత్వం ప్రకారం మొత్తం వ్యాపారి లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కావని, అయినప్పటికీ మిగిలిన లావాదేవీలపై రుసుము విధించే విధానాన్ని ప్రజా ప్రయోజనాల కోణంలో సమీక్షించాలన్నారు. యూపీఐ ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన డిజిటల్ ప్రజా మౌలిక వసతి, రుసుముల విస్తరణకు మార్గంగా మారకూడదు అని సంఘం స్పష్టం చేస్తోందన్నారు. వ్యాపారులపై విధించే రుసుమును వినియోగదారులపై అదనపు భారంగా బదిలీ చేయకుండా కఠినమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు, యువత, విద్యార్థులు ఎలాంటి పరోక్ష భారానికి గురికాకుండా చూడాలని, యూపీఐ రుసుముల విధానం, వాటి పంపిణీ, భవిష్యత్ మార్పులపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి వస్తువుపై ఇప్పటికే జీఎస్టీని విధించి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. యూపీఐ చార్జీల బిల్లును తీసుకువస్తే చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలపై విపరీతమైన భారంపడే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. యూపీఐ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను ఏకం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు వేల్పుల చంద్రశేఖర్, గొర్ల రాజు యాదవ్, బోడపట్ల రాజు, మ్యాక యాదయ్య, చైతన్య, మహేశ్వరి, రజిత, శ్రీలత, మణికంఠ, ప్రవళిక, ప్రశాంతి, సంజీవ్, రవళి, అక్షయ, శ్రీనివాస్, సాగర్, అఖిల్, నారాయణ, 60 మంది యువతి యువకులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )