కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి వాస్తవ్యులు. రశ్వంత్ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
బాబు పుట్టిన 5 సంవత్సరాలకే తండ్రి మృతిచెందడం ఆ కుటుంబానికి తీరని లోటుగా మారింది. ప్రస్తుతం వారి అమ్మ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబానికి అండగా మేనమామ సహాయం చేస్తూ నిలుస్తున్నారు.
ఈ విషయాన్ని శ్రీమాతా సేవ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ, రశ్వంత్ విద్యాభ్యాసం కొనసాగించేందుకు సహాయం చేయాలని కోరారు.
దీనిపై వెంటనే స్పందించిన శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్, “నెలకొక మంచి పని – నారాయణ సేవ” కార్యక్రమం ద్వారా, శ్రీమాతా సేవ కుటుంబ సభ్యుల తరఫున రశ్వంత్ విద్యాభ్యాసం కోసం ₹7,500/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
రశ్వంత్ ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు మనం చేసే చిన్న సహాయం వారి భవిష్యత్తుకు పెద్ద అండగా మారుతుంది.
ఇంకెవరైనా దాతలు, సేవాభావం ఉన్న స్నేహితులు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్ హృదయపూర్వకంగా కోరుతోంది.
విద్యాదానం మహాదానం — ఒక విద్యార్థి భవిష్యత్తుకు మనం అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నం శెట్టి శ్రీనివాస్, డాక్టర్ పల్స హరీష్ గౌడ్, కోడిప్యాక సాయిరాం పాల్గొన్నారు.