Logo
Date of Publish : 12 July 2026, 2:48 am
Editor : Katta Ravindar

రాంపూర్ యువకుడికి ఇండియన్ నేవీలో ఉద్యోగం ఆయేషా వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.. రూ.20 వేల ఆర్థిక సాయం

[caption id="attachment_3806" align="alignleft" width="720"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం :- రాంపూర్ గ్రామానికి చెందిన యువకుడు వడ్ల నిఖిల్ ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. రాంపూర్ గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మి నర్సయ్య, ఈశ్వరి దంపతుల కుమారుడైన నిఖిల్.. నేవీలో ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా నుంచి నలుగురు యువకులు ఇండియన్ నేవీకి ఎంపిక కాగా, అందులో రాంపూర్ గ్రామానికి చెందిన నిఖిల్ ఉండటం గ్రామంతో పాటు నవీపేట్ మండలం, బోధన్ నియోజకవర్గానికి గర్వకారణమని పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయేషా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ ఆయేషా ఫాతిమా హైదరాబాద్‌లోని తన నివాసంలో నిఖిల్‌ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. నేవీ ప్రాథమిక శిక్షణ కోసం ఒడిశాకు వెళ్లనున్న నిఖిల్‌కు ప్రోత్సాహంగా రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ.. దేశ సేవ చేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని, నిఖిల్ లాంటి యువత దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఇండియన్ నేవీలో ఉన్నత స్థాయికి ఎదిగి రాంపూర్ గ్రామానికి పేరు తీసుకురావాలని అభిలషించారు.
కార్యక్రమంలో నర్సింగ్ రావు, మాజీ సర్పంచ్ అల్లం రమేష్, మాజీ ఎంపీటీసీ గైని మోహన్, సన్నీ సింగ్ తదితర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )