Logo
Date of Publish : 29 September 2026, 11:13 am
Editor : Katta Ravindar

రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాకు రాష్ట్రంలో రెండో స్థానం

కామారెడ్డి జిల్లా : సెప్టెంబర్ 29:k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో రెండో అత్యధిక సభ్యత్వ నమోదును సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా ప్రతినిధులకు అభినందనలు, ప్రశంసలు అందాయి.
గవర్నర్ సమక్షంలో రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదును విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా అధికారులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, వివిధ సంస్థలు, ప్రజాప్రతినిధులు మరియు ఇతర భాగస్వాములు సమన్వయంతో కృషి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారుల సమిష్టి కృషి, సేవా స్ఫూర్తి, మానవతా దృక్పథం ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంతో పాటు, రాబోయే సంవత్సరంలో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించే దిశగా మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
కామారెడ్డి జిల్లాకు ఈ గుర్తింపు రావడానికి కృషి చేసిన ప్రతి అధికారి, సిబ్బంది, సభ్యుడు మరియు భాగస్వామికి జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )