Logo
Date of Publish : 06 September 2026, 9:02 am
Editor : Katta Ravindar

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

నిజామాబాద్ జిల్లా,నవీపేట్, సెప్టెంబర్ 5: మండలంలోని పోతంగల్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పోతంగల్ గ్రామానికి చెందిన మాహూరి లక్ష్మీ (60) శుక్రవారం నవీపేట్ కూరగాయల సంతకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఎదురుుగా వస్తున్న ఆటో రిక్షా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించి శనివారం మృతి చెందింది. కుమారుడు మాహూరి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )