[caption id="attachment_6622" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-లింగాపూర్: సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయి. లింగాపూర్ పరిధిలోని పలు వరి పొలాల్లో నీరు లేక పంటలు వాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
రైతులకు సాగునీరు అందించేందుకు నిజాంపూర్–లింగాపూర్ ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. తమ పొలాలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తిపోతల పథకం ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. ఎమ్మెల్యే గారి స్వగ్రామం సమీపంలోనే ఈ పరిస్థితి నెలకొనడంపై కూడా రైతులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.
ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి తమ పంటలకు సాగునీరు అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.[/caption]