[caption id="attachment_6157" align="alignright" width="1080"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్, సెప్టెంబర్ 17: నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు వాగులో పడి మృతి చెందారు. గ్రామానికి చెందిన అల్లే గణేష్ (27), అల్లే లయ (24) ప్రమాదవశాత్తు వాగులో పడినట్లు సమాచారం.
స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. నీటిలో మునిగిపోయిన ఇద్దరి మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అన్నాచెల్లెలు వాగులోకి ఎలా వెళ్లారు, ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.[/caption]