Logo
Date of Publish : 15 July 2026, 5:57 am
Editor : Katta Ravindar

వానాకాలంలోనూ మండుతున్న ఎండలు ఎండిపోతున్న పంటలు ఆవేదనలో రైతులు ఫకీరాబాద్

[caption id="attachment_3913" align="alignleft" width="2560"] నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :- ఫకీరాబాద్ వానాకాలం సీజన్ కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పొలాల్లోని వరి పంటలు ఎండిపోతున్నాయి. భారీ ఆశలతో సాగు చేసిన రైతులు ఇప్పుడు ఆకాశం వైపు ఆశగా చూస్తూ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. నీటి కొరత కారణంగా పంటలు రోజురోజుకూ వాడిపోతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
"ఒక్క మంచి వర్షం పడితేనే పంటలు బతుకుతాయి.. లేకపోతే ఈ సీజన్ మొత్తం నష్టమే" అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగుకు చేసిన పెట్టుబడులు, ఎరువులు, విత్తనాల ఖర్చులు పెరిగిపోయాయని, ఇప్పుడు పంటలు ఎండిపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
వ్యవసాయానికి అవసరమైన సాగునీటిని అందించడంతో పాటు రైతులకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు. అలాగే వరుణుడు కరుణించి త్వరగా సమృద్ధిగా వర్షాలు కురవాలని రైతాంగం ఆశాభావంతో ఎదురుచూస్తోంది.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )