కోహెడ, తెలుగు కే న్యూస్ జూన్ 27: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో భక్తుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత నిధులతో బోరు ఏర్పాటు చేయించారు.
గ్రామ ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించి నీటి సౌకర్యం కల్పించినందుకు గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ–జీవన్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు